KNR: కోర్టులో ఆదివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో మోటార్ వాహన ప్రమాదాలకు సంబంధించిన కేసులు స్నేహపూర్వకంగా పరిష్కారమయ్యాయి. ఈ సందర్భంగా బాధితులకు రూ. 78 లక్షల క్లైమ్ మొత్తాన్ని జడ్జి శివకుమార్ అందజేశారు. లోక్ అదాలత్ ద్వారా వేగవంతమైన న్యాయం లభిస్తుందని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని న్యాయమూర్తి సూచించారు.