ADB: కులస్తులందరూ ఐక్యంగా ఉండి సంఘం పటిష్టత కోసం కృషి చేయాలని అఖిల గాండ్ల తెలికుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బీర్కూర్ వార్ నగేష్, పద్మావతి పిలుపునిచ్చారు. ఆదిలాబాద్‌లోని బీసీ సంఘ భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘ ప్రతిష్టత కోసం పలువురి అభిప్రాయాలను సేకరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు, నాయకులు రాజేశ్వర్, చందు పాల్గొన్నారు.