NZB: ఆర్మూర్ పరిధిలోని ప్రధాన రహదారులు, వంతెనల పునర్నిర్మాణ పనులను తక్షణమే మంజూరు చేయాలని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి కోరారు. ఈ మేరకు మంత్రి సీతక్కను కలిసి ఆయన వినతిపత్రం అందజేశారు. గ్రామాలను అనుసంధానించే రోడ్లు, శిథిలావస్థకు చేరిన వంతెనల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రికి వివరించారు.