MBNR: గండీడ్ మండలం వెన్నచేడ్లో పంచాయతీ ఎన్నికల సందడి ముగిసింది. నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు, వార్డు సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీ కార్యాలయాన్ని అధికారులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కొత్త పాలకవర్గం బాధ్యతలు చేపట్టనుండటంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామస్థులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.