MBNR: పదరా పోదాం మన్యంకొండకు అంటూ.. భక్తులు భారీగా పాదయాత్ర నిర్వహించారు. ఆదివారం పట్టణంలోని రాం మందిర్ చౌరస్తా నుంచి మన్యంకొండ వేంకటేశ్వర స్వామి ఆలయం వరకు యాత్ర సాగింది. ధ్వజాలంకరణలు, కోలాటాలు, భజనలతో భక్తులు ఉత్సాహంగా పాల్గొని, ప్రజల సుఖశాంతుల కోసం స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.