TG: తెలంగాణ భవన్లో BRS విస్తృతస్థాయి సమావేశం ముగిసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై నిరసనగా మండలస్థాయి సమావేశాలు నిర్వహించాలని KCR పార్టీ నేతలకు సూచించారు. రాబోయే 15రోజుల్లో మూడు బహిరంగ సభలు పెట్టాలని నిర్ణయించారు. మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో సభలు జరపాలని తెలిపారు. ఈ సమావేశం దాదాపు 3 గంటల పాటు జరిగింది. కాసేపట్లో KCR మీడియా ముందుకు రానున్నారు.