NRML: ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ హైదరాబాద్‌లో ఆదివారం మంత్రి సీతక్కను మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల నిర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరించిన సందర్భంగా మంత్రి సీతక్క బొజ్జు పటేల్‌ను అభినందించారు. సీతక్క మాట్లాడుతూ.. బొజ్జు పటేల్ నాయకత్వంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.