NRPT: పట్టుదలతో శ్రమిస్తే లక్ష్యం సుసాధ్యమని మక్తల్‌కు చెందిన బోయ రమేష్ నిరూపించారు. ఇటీవల వెలువడిన గ్రూప్-3 ఫలితాల్లో ఆయన ప్రతిభ చాటి సమాచార పౌర సంబంధాల శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ఎంపికయ్యారు. నిరుపేద కుటుంబానికి చెందిన రమేష్.. తన చదువంతా ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే పూర్తి చేసి, మొదటి ప్రయత్నంలోనే ఈ విజయం సాధించారు.