TG: ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడు.. మహబూబ్నగర్ జిల్లాను దత్తత తీసుకుని పునాది రాళ్లు వేశారు. ఉద్యమ సమయంలో ఎందుకు ఈ రాళ్లు అని చాలా సార్లు ప్రశ్నించాను. పాలమూరు జిల్లాలో వలస వెళ్లడానికి బొంబాయికి బస్సులు ఉండేవి. జిల్లా మొత్తం కృష్ణా బేసిన్లో ఉన్నా.. ఘోరమైన కరువు’ అని అన్నారు.