TG: హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్హోం కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. వారితో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. కాగా, శీతాకాల విడిది కోసం ఈ నెల 17న వచ్చిన ముర్ము ఆరు రోజుల పర్యటన ముగించుకుని రేపు సాయంత్రం తిరిగి ఢిల్లీకి బయలుదేరనున్నారు.