ATP: పెద్దవడుగూరు మండలం రావులుడికి గ్రామంలో కమలేశ్వర్ రెడ్డి(8) ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందాడు. ఆదివారం కావడంతో కమలేశ్వర్ రెడ్డి తల్లిదండ్రులతో కలిసి పొలం వద్దకు వెళ్లాడు. గ్రామ శివారులోని కుంటలోకి ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందాడు. బాలుడు మృతితో రావులుడికిలో విషాదఛాయలు అమ్ముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.