NZB: తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావును ఆదివారం ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, గాంధారి మాజీ జడ్పీటీసీ తానాజీ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హరీష్ రావును శాలువాతో సత్కరించారు. అనంతరం, ఎల్లారెడ్డి నియోజకవర్గ రాజకీయాలు, సోమార్పేట్ సంఘటనపై కాసేపు చర్చించారు.