గుంటూరులో ఆదివారం జరిగిన జిల్లా స్థాయి మహిళా ఉపాధ్యాయుల క్రీడల్లో ప్రతిభ కనబరిచిన పొన్నూరు మండలం చెందిన ఐదుగురు మహిళా ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికయ్యారు. వారు గుంటూరు జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ విషయాన్ని ఉపాధ్యాయురాలు ఉమాదేవి తెలిపారు. విజేతలను ఉపాధ్యాయులు, విద్యార్థులు, పుర ప్రముఖులు ఘనంగా అభినందించారు.