W.G.: గోదావరి క్రీడోత్సవాల్లో భాగంగా కలెక్టర్ చదలవాడ నాగరాణి పలు క్రీడల్లో పాల్గొని క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఆదివారం జరిగిన ఉద్యోగుల క్రీడా పోటీలను ఆమె స్వయంగా పరిశీలించారు. ప్రతిభ కనబరిచిన వారిని అభినందించారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో తోడ్పడతాయని కలెక్టర్ పేర్కొన్నారు.