KMR: ఈ నెల 22, 23 తేదీల్లో కాకతీయ యూనివర్సిటీ వేదికగా జరగనున్న విశ్వవిద్యాలయాల విద్యార్థుల సమ్మేళనానికి తెలంగాణ విశ్వవిద్యాలయ ఏబీవీపీ నాయకులు పెద్ద సంఖ్యలో ఆదివారం బయలుదేరి వెళ్ళారు. ఏబీవీపీ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు రేంజర్ల నరేష్ జెండా ఊపి బస్సును ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. దేశంలో అతిపెద్ద విద్యార్థి సంఘం ఏబీవీపీ అని పేర్కొన్నారు.