KDP: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం దుర్మార్గమైన చర్య అని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అన్నారు. మాజీ CM వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సిద్ధవటం మండలం భాకరాపేట మూడు రోడ్ల కూడలిలో ఉన్న దివంగత CM వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద ఆదివారం ఎమ్మెల్యే కేకును కట్ చేశారు.