NZB: బోధన్ పట్టణంలోని 108 అంబులెన్స్‌ను ఆదివారం మధ్యాహ్నం ఆడిట్ అధికారి వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనంలోని అత్యవసర మందుల నిల్వలు, వైద్య పరికరాల పనితీరును, రికార్డులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అత్యవసర సమయాల్లో రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది పనితీరు, నిర్వహణపై ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తూ అభినందించారు.