ELR: ఉపాధి హామీ రద్దకొత్తగా తీసుకొచ్చిన బిల్లు పేదలకు ఎలాంటి ఉపయోగంచేయదని, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బలరాం డిమాండ్ చేశారు. ఏలూరులో ఆదివారం జరిగిన జిల్లా సెక్రటేరియట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉపాధి గ్యారంటీని రద్దు చేసి పథకాన్ని దయాదాక్షిణ్యాలుగా మార్చారని విమర్శించారు.