WGL: మధ్యప్రదేశ్ భోపాల్లో జరిగిన 16వ నేషనల్ WFSKO ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్–2025లో వర్ధన్నపేట పట్టణంకు చెందిన పూస్కోస్ స్కూల్ విద్యార్థి ఎం. మహాజన్ ఉపేంద్ర బంగారు పతకం సాధించాడు. 10 ఏళ్ల లోపు బాలుర విభాగంలో జాతీయ స్థాయిలో ఈ ఘన విజయం సాధించిన ఉపేంద్రను ఆదివారం పాఠశాల యాజమాన్యం, పట్టణ ప్రముఖులు అభినందించారు.