టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి తర్వాత క్రికెట్ మానేయాలనుకున్నట్లు తెలిపాడు. వరల్డ్ కప్ కోసం కెప్టెన్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చాలా కష్టపడినట్లు పేర్కొన్నాడు. అయితే, తుది మెట్టు మీద బోల్తా పడటంతో తీవ్రంగా బాధపడినట్లు చెప్పాడు. ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని చెప్పుకొచ్చాడు.