మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ప్రజా ఉద్యమాలు, భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఆదివారం తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చామని, అయితే ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న జాప్యం వల్ల మొదటికే మోసం వచ్చేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.