TG: ఒక్కఏడాదిలోనే 75 గ్లోబల్ కేపబులిటీ సెంటర్లను తీసుకువచ్చామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అత్యధికంగా జీసీసీలు వచ్చిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు. గతేడాది రూ.3.40 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చామన్నారు. కొత్త పెట్టుబడులతో 1.40 లక్షల మందికి ఉద్యోగావకాశాలు వచ్చాయన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావొద్దని BRS నాయకత్వం కోరుకుంటోందని విమర్శించారు.