TG: మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. ఇప్పటివరకు మహిళలు రూ.255 కోట్ల విలువైన ఉచిత ప్రయాణాలు చేశారని, PF, CCS బకాయిలను భారీగా తగ్గించామని వెల్లడించారు. త్వరలో ప్రతి మహిళకు ఉచిత ప్రయాణ స్మార్ట్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. దీంతో మహిళలు టికెట్ లేకుండా ఈ స్మార్ట్ కార్డుల ద్వారా ఉచిత ప్రయాణం చేయవచ్చన్నారు.