HYD: జనవరి 13, 14 తేదీల్లో HYD పరేడ్ గ్రౌండ్లో డ్రోన్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో డ్రోన్ డే సందర్భంగా అద్భుతమైన డ్రోన్ ప్రదర్శనలు చేయనున్నారు. సంక్రాంతి పండగను పురస్కరించుకుని జనవరి 16 నుంచి 18 వరకు హాట్ ఎయిర్ బెలూన్ ప్రదర్శన నిర్వహించనున్నట్లు ఎండీ వల్లూరి శ్రీకాంత్ తెలిపారు.