JGL: రోడ్డు ప్రమాదంలో అపసార్మకస్థితిలోకి వెళ్లిన వ్యక్తికి పోలీసులు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. జగిత్యాల కొత్త బస్టాండ్ సర్కిల్ ప్రదేశంలో ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. అయితే అక్కడే ఉన్నా ఒక వ్యక్తిని ఆటో ఢీకొనడంతో అపస్మారస్థితిలోకి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్స్ అది గమనించి వెంటనే సమయస్ఫూర్తితో సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడినట్లు వారు పేర్కొన్నారు.