NLR: సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంగళవారం ముత్తుకూరు, పొదలకూరు మండలాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు ముత్తుకూరు ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో అదాని ఫౌండేషన్ సౌజన్యంతో చలివేంద్రం, కృష్ణపట్నంలో గిరిజన విద్యార్థులకు రెండు స్కూల్ వ్యాన్ల ప్రారంభ కార్యక్రమాలలో పాల్గొననున్నారు.