శ్రీలంక మహిళలతో ఇవాళ భారత్ రెండో T20లో తలపడనుంది. తొలి మ్యాచ్ మాదిరి ఇందులోనూ లంకపై ఆధిపత్యం చెలాయించాలని భావిస్తోంది. అలాగే తొలి T20లో చేసిన ఫీల్డింగ్ తప్పిదాలు పునరావృతం కాకుండా ప్రాక్టీస్‌లో చెమటోడ్చింది. అటు ఓటమితో సిరీస్ ప్రారంభించిన లంక.. ఇవాళ విజయం సాధించి లెక్క సమం చేయాలనే యోచనలో ఉంది. విశాఖ వేదికగా రా.7 గంటలకు ఇరుజట్లు బరిలోకి దిగనున్నాయి.