పల్నాడు జిల్లాలోని నిరక్షరాస్యులందరినీ అక్షరాస్యులుగా మార్చి, జిల్లాను ‘అక్షర పల్నాడు’గా తీర్చిదిద్దాలని కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను కోరారు. సోమవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో గుర్తించిన 1,27,565 మంది నిరక్షరాస్యులకు తక్షణమే తరగతులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు చదువు నేర్పాలన్నారు.