SRCL: బోయినపల్లి మండలం విలాసాగర్ సర్పంచ్ ఏనుగుల కనకయ్య ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీలను, బాధ్యతలు చేపట్టిన తొలిరోజే అమలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. సోమవారం సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే.. గ్రామంలో ఆడబిడ్డ పుట్టిన కుటుంబానికి రూ. 5,000 చెక్కును అందజేశారు. అదేవిధంగా, గ్రామస్థులకు కేవలం ఒక్క రూపాయికే 20 లీటర్ల నీళ్లు సరఫరా చేసినట్లు పేర్కొన్నారు.