ASF: పేకాట స్థావరంపై దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు కాగజ్నగర్ సీఐ రవీందర్ తెలిపారు. దరిగాం శివారులో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుంచి రూ.7,100 నగదు స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు.