NLR: APని ‘అత్యాచార ఆంధ్రప్రదేశ్’గా మార్చారని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత మండిపడ్డారు. NLR వైసీపీ కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడారు. 18 నెలల కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మంగళగిరిలో 13 ఏళ్ల బాలికపై నలుగురు అత్యాచారం చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.