MLG: మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ ఇవాళ మేడారంలో పర్యటించనున్నారు. జనవరి 28 నుంచి నాలుగు రోజులపాటు జరిగే మహా జాతర కోసం జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. అనంతరం అధికారులతో సమావేశమై పనుల పురోగతిపై చర్చిస్తారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.