సత్యసాయి: పెనుకొండ పరిసర అటవీ ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు ఆదివారం డ్రోన్లతో గాలింపు చేపట్టారు. ఆధునిక సాంకేతికతను వాడుతూ అటవీ మార్గాలు, చెరువులు, అనుమానాస్పద ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నేరాల నియంత్రణకు ఈ నిఘా ఎంతో తోడ్పడుతుందని పోలీసులు తెలిపారు.