సంగారెడ్డి జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి జయంతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. మొత్తం 4,248 కేసులు పరిష్కరించినట్లు చెప్పారు. వీటిలో క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు 3,635, సివిల్ కేసులు 39, మోటార్ వాహన ప్రమాద కేసులు 19 కేసులు పరిష్కరించామన్నారు.