W.G: పెనుగొండ మండలం సిద్ధాంతం శ్రీ కేదారేశ్వర స్వామి ఆలయాన్ని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ కార్యక్రమాల్లో పాల్గొని, వేద పండితుల ఆశీర్వచనం పొందారు. వచ్చే 2027 గోదావరి పుష్కరాలు దృష్ట్యా పుష్కర ఘాట్లను పరిశీలించి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు.