ATP: జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రంలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న కానిస్టేబుళ్ల శిక్షణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు ఆదివారం డీఐజీ డాక్టర్ షెముషి, ఎస్పీ జగదీష్ వేర్వేరుగా శిక్షణ కేంద్రాన్ని సందర్శించి సౌకర్యాలను పరిశీలించారు. బ్యారక్లు, వంటశాల, తరగతి గదులు, పరేడ్ గ్రౌండ్లను తనిఖీ చేసి అధికారులకు సూచనలు ఇచ్చారు.