TG: కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎరువుల కోసం చెప్పుల లైన్లు పెట్టే పరిస్థితి వచ్చిందని KCR విమర్శించారు. ‘ఎరువుల బస్తాలకు యాప్ ఎందుకు. దీంతో రైతులకు ఇబ్బంది. ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను మోసం చేశారు. వృద్ధులకు, వికలాంగులకు ఆసరాగా ఉండాలని పెన్షన్లు ఇవ్వాలని మేము అనుకున్నాం. ఇచ్చిన మాట ప్రకారం రెండో సారి గెలవగానే మొదటి నెలలోనే పెన్షన్లను 2వేలు చేశాం’ అని గుర్తు చేశారు.