CTR: నగరి మండల వెల్డింగ్ వర్కర్స్ యూనియన్ సమావేశం సీపీఐ కార్యాలయంలో ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి వర్కర్స్ నాయకుడు దాము, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య హాజరయ్యారు. నూతన కమిటీని ఎంపిక చేశారు. అధ్యక్షుడిగా వినోద్, కార్యదర్శిగా సురేశ్, కోశాధికారిగా విజయ్, ఉపాధ్యక్షుడిగా మస్తాన్, అరుణగిరి, రాజా తదితరులను ఎంపిక చేశారు.