HYD: ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే తెలంగాణకు శాపమని మాజీ సీఎం కేసీఆర్ విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తెలంగాణకు చేస్తున్న ద్రోహంపై ఆయన ధ్వజమెత్తారు. కృష్ణా నది మహబూబ్నగర్ నుంచే పారుతున్నా, గత కాంగ్రెస్, టీడీపీ పాలకులు పాలమూరుకు కోలుకోలేని నష్టం చేశారని మండిపడ్డారు. తెలంగాణ హక్కుల రక్షణపై ప్రధానంగా చర్చ జరిగిందని ఆయన పేర్కొన్నారు.