E.G: పీఎం మోడీ, సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో అభివృద్ధి వేగం పెరుగుతుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో రూ.2 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.