దుబాయ్ వేదికగా జరిగిన U19 ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 348 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. పాక్ బౌలర్ల ధాటికి కేవలం 26.1 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ (26), ఆయూష్ మాత్రే (2) తీవ్రంగా నిరాశపరిచారు. దీంతో పాకిస్తాన్ 191 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించి, ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది.