లెఫ్టినెంట్ కల్నల్ దీపక్ కుమార్ శర్మను CBI అరెస్ట్ చేసింది. రక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థల నుంచి ఆయన లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో భాగంగా ఆయన నివాసం నుంచి రూ. 2 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్’లో విధులు నిర్వర్తిస్తున్నారు.