ADB: అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని SP అఖిల్ మహాజన్ ప్రజలకు సూచించారు. ఆదివారం నేరడిగొండ, సిరికొండ మండలంలోని పోలీస్ స్టేషన్లను ఆయన సందర్శించారు. స్టేషన్లోని రికార్డులను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. గుడుంబా, మాదకద్రవ్యాలకు బానిస కాకుండా ఉండాలన్నారు. స్టేషన్కి వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు.