BLOల సమావేశంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో తెలంగాణలో SIR అమలు చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో SIR అమలవుతోందని తెలిపారు. తెలంగాణలోనూ SIRను విజయవంతం చేయాలని సూచించారు. కెనడా కంటే తెలంగాణ పెద్దదన్నారు. డబుల్ ఓట్లను సవరించడానికే SIR ప్రక్రియ అని.. ఐదేళ్లకోసారి ఓటర్ జాబితాను క్లీన్ చేస్తామని చెప్పారు.