KMR: పిట్లం స్థానిక ZPHS పాఠశాల ఆవరణలో నేడు 1992-95 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సుమారు మూడు దశాబ్దాల తర్వాత సహాధ్యాయులంతా ఒకే చోట చేరడంతో పాఠశాల ప్రాంగణం పాత జ్ఞాపకాలతో కళకళలాడింది. చిన్ననాటి స్నేహితులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు.