W.G: తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైసీపీ నాయకులు, మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, వైసీపీ నేత వడ్డే రఘురామ్ నాయుడు ల ఆధ్యర్యంలో విడివిడిగా పలు ప్రాంతాల్లో స్వీట్లు పంచి కోలాహలంగా నిర్వహించారు. పలు చోట్ల వైసీపీ శ్రేణులు పార్టీ జెండా ఎగురవేసి, జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.