SDPT: అక్కన్నపేట మండలంలోని కుందనవానిపల్లిలో షార్ట్ సర్క్యూట్తో భారీ ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన మోసర్ల రాజిరెడ్డి దంపతులు వ్యవసాయ పనులకు వెళ్లిన సమయంలో ఇంట్లో మంటలు చెలరేగి సామగ్రి, రూ.50 వేల నగదు పూర్తిగా దగ్ధమయ్యాయి. మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూసేసరికి సర్వం కోల్పోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.