SDPT: హుస్నాబాద్ మండల పరిధిలో అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై పాకాల లక్ష్మారెడ్డి హెచ్చరించారు. పొట్లపల్లి గ్రామానికి చెందిన బండి మల్లేశం అనే వ్యక్తి తన ఇంట్లో బెల్ట్ షాప్ నిర్వహిస్తూ.. మద్యం అమ్ముతున్నాడన్న నమ్మదగిన సమాచారంతో ఎస్సై తన సిబ్బందితో కలిసి దాడులు చేశారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.6,130 విలువ గల మద్యాన్ని సీజ్ చేశారు.