TG: కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రానికి కిషన్ రెడ్డి తెచ్చింది ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. వారి 12 ఏళ్ల పాలన, తమ రెండేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణకు కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారన్నారు. సోనియాగాంధీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల్లో మెజార్టీ అంశాలను నెరవేర్చామని తెలిపారు.