WNP: పెద్దమందడి మండలం దొడగుంటపల్లి గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్ నాయకుడు సుదర్శన్‌ను ఎమ్మెల్యే మెగా రెడ్డి ఆదివారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆయన అధైర్య పడకండి అని భరోసా ఇచ్చారు. అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇస్తూ.. ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.